Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్...

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్..!

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు గ్రామాల్లో మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరకు ఆయన చేసిన కృషి ని గుర్తు చేశారు. మండల కేంద్రంలో మండల విశ్వబ్రహ్మన, విశ్వకర్మ ఐక్యసంఘం అధ్యక్షులు సద్గునచారి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలను హట్టహసంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్దాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయులని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో, కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. హైద్రబాద్ ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం జయశంకర్ క్యాంస విగ్రహన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కల్వకుంట రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు సత్యం, నాయకులు నందు, బ్రహ్మచారి, లక్ష్మిరాజం, శ్రీనివాస్, నవీన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, బీఆరఎస్ నాయకులు చెవుల మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img