ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గాయత్రి మాత పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం గొల్లపల్లిలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. సంఘ అధ్యక్షులు శ్రీకోటి భూమయ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో నీళ్లు,నిధులు, నియామకాలు తెలంగాణ వాటా గురించి లెక్కలు చెప్పిన మహనీయుడు జయశంకర్. తెలంగాణ రాష్ట్రము చూడకుండానే తనువు చాలించిన ఉద్యమకారుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీకోటి భూమయ్య, ప్రధాన కార్యదర్శి ఎదులాపురం లక్ష్మనాచారి,సభ్యులు చింతల సత్యనారాయణ, పోలుకల రాజగణేష్, ఎదులాపురం భాస్కరచారి, ఎదులపురం నరసింహచారి, గర్రెపల్లి శంకరయ్య, తుమ్మనపల్లి వెంకటస్వామి, సజ్జనపు రవి, గుగ్గిళ్ల గోపి పాల్గొన్నారు.