ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా సంస్థ సరికొత్త అప్డేట్ ను తీసుకువచ్చింది. ఇన్‌స్టా ప్రొఫైల్ సాంగ్ పేరుతో ఓ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచరు యాక్సెస్ చేసుకుంటే చాలు.. సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా మనకు నచ్చిన పాటని ప్రొఫైల్లో సెట్ చేసుకోవచ్చు. ఇతరులు ఎవరైనా మన ప్రొఫైలు చూసినప్పుడు ఆ పాట ప్లే అవుతుంది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ను వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.