Homeహైదరాబాద్latest Newsదేవుడి మీద ఒట్టేసి.. రైతులను మోసం చేశారు: హరీష్ రావు

దేవుడి మీద ఒట్టేసి.. రైతులను మోసం చేశారు: హరీష్ రావు

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను చూశాం.. ఇప్పుడు ప్రజలనే కాకుండా దేవుళ్లను కూడా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని చూస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గురువారం యాదాద్రిలో మాట్లాడుతూ.. 20 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని, రుణమాఫీ చేయాలని నిరసన తెలిపితే రైతులపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీపై ప్రశ్నిస్తే వాగులో దూకమని మాట్లాడుతున్నారని అన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img