Homeజిల్లా వార్తలు‘Praja Vani’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి

‘Praja Vani’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి

– అధికారులకు జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్ ఆదేశం

ఇదే నిజం ప్రతినిధి వరంగల్: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​.. అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్​ జీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణికి మొత్తం 60 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ హరిప్రసాద్, మైనింగ్ విభాగం ఏడి నర్సిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, మెప్మా పీడీ బద్రు నాయక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img