Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు.. ఇతర ప్రాంతాల యువతులను తీసుకొచ్చి..!

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు.. ఇతర ప్రాంతాల యువతులను తీసుకొచ్చి..!

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను హైదరాబాద్ కు తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి చెర నుంచి ఆరుగురు బాధితులను రక్షించారు. సూర్యకుమారి అలియాస్ రాణి (38), విజయశేఖర్ రెడ్డి (49), అర్కోకిత్ ముఖర్జీ (30)ని అదుపులోకి తీసుకున్నారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఏపీ నుంచి ఈ ముఠా యువతులు, మహిళలను తీసుకువచ్చి హోటల్స్, ఫాం హౌస్‌లకు పంపుతున్నట్టు గుర్తించారు. ముఠా సభ్యుల నుంచి రూ. 89,500 నగదు, రెండు కార్లు, ఐఫోన్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img