ముంబాయిః మేజరైన మహిళ తన వృత్తిని ఎంచుకునే ప్రాథమిక హక్కు ఉందని, వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని తెలుపుతూ నిర్బంధంలో ఉన్న ముగ్గురు సెక్స్ వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1956 అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం ప్రకారం వ్యభిచారం నేరపూరిత చర్యగా పేర్కొనలేదన్నారు.
వ్యభిచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పృథ్యీరాజ్ చవాన్ విచారించి తీర్పును ప్రకటించారు. అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956 ప్రకారం మూడు వారాల వ్యవధికి మించి బాధితులను అదుపులో ఉంచేందుకు మేజిస్ర్టేట్‌కు అధికారం లేదన్నారు. పిటిషనర్లు దుర్బుద్దితో ఇతరులను మోహిస్తున్నట్లుగా గానీ లేదా వారు వేశ్యాగృహం నడుపుతున్నారనడానికి గానీ ఎటువంటి ఆధారాలు రికార్డులో లేని కారణంగా తక్షణమే విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఒక గెస్ట్‌హౌజ్‌పై దాడి చేసిన పోలీసులు ముగ్గురు మహిళలను, మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితులుగా పేర్కొన్న ముగ్గురు మహిళలను పరివర్తన మార్పు కింద ఒక ఆశ్రమానికి తరలించారు. దీన్ని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.
వ్యభిచారం నేరం కాదు.. ముంబాయి హైకోర్టు సంచలన తీర్పు
RELATED ARTICLES