Homeహైదరాబాద్latest Newsకూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది : శ్యామల

కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది : శ్యామల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై వేశ్య అత్యాచారానికి గురైంది. పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని శ్యామల అన్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని శ్యామల ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నో దారుణాలు జరిగాయని ఆమె అన్నారు. పిఠాపురంలో జానీలు రెచ్చిపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై మాజీ మంత్రి రోజా కూడా స్పందించారు. ప్రసాదాల కోసం కాకుండా రాష్ట్రంలోని ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకే దీక్ష చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.

Recent

- Advertisment -spot_img