Homeజిల్లా వార్తలుతాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

ఇదే నిజం, కామారెడ్డి: బాన్సువాడ బీర్కూర్ మండల కేంద్రంలోని కుమ్మరిగల్లీలో వారం రోజుల నుంచి నీటి ఎద్దడి నెలకొంది. పైప్ లైన్ పగిలిపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నీటి ట్యాంకు ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img