ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొనూరు గ్రామం కు చెందిన రామడుగు చందు అనారోగ్యం తో హాస్పిటల్ లో మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి గూర్చి ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేయగా వెంటనే 5000/- రూపాయలు పంపించడం జరిగింది, ఇట్టి ఆర్థిక సాయం ను మృతి చెందిన చందు యొక్క తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముత్యం గంగారాం,ధర్మపురి నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసరి పురుషోత్తం,మాజీ సర్పంచ్లు నన్నేపు సురేందర్ రాజు,మామిడి చంద్రయ్య, గొట్టం రాజయ్య,చిట్యాల లక్ష్మి, బెత్తెపు సత్తయ్య,పల్లి లక్ష్మణ్,దాసరి అంజయ్య,గొట్టం పోచయ్య,అసదు నారాయణ,దాసరి పెద్ద రమేష్,కొల్లూరి దాసు,కస్తూరి లక్ష్మణ్, గొల్లేన పెద్దన్న, దాసరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు