118 చైనా యాప్స్ బ్యాన్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీః చైనా యాప్‌లపై కేంద్రం ఉక్కపాదం మోపుతోంది. యూత్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పబ్జీ గేమ్‌ను కేంద్రం నిషేధించింది. దేశ సమగ్రతకు, భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పబ్జీతో పాటు 118చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేస్తూ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ చలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే చైనాకు చెందిన మొబైల్ యాప్స్ ద్వారా హ్యాకర్స్ దాడులు చేస్తున్నట్లు కేంద్రానికి ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి దాడుల కారణంగా దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం చైనా యాప్‌లను నిషేధించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సిఫారసు మేరకు చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది.