ఇదే నిజం, జనగామ: జనగామ పట్టణంలోని మూడో వార్డులో ప్రజా పాలన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ.. ప్రజలు ఆందోళన చెందొద్దని.. అందరి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అధికారులను సంప్రదించాలని కోరారు.