Homeజిల్లా వార్తలుప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

ఇదే నిజం, ఆత్మకూరు: తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న అభయహస్తం గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలని హౌస్ బుజుర్గ్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సయ్యద్ షరీఫ్ అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభయహస్తం గ్యారంటీలకు పంచాయతీ కార్యాలయంలో అధికారులు నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. యువత ముందు ఉండి అభయహస్తం గ్యారంటీల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలను న్యాయం జరుగుతుందన్నారు. పైరవీలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు

Recent

- Advertisment -spot_img