– సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ హత్య కేసులో నలుగురు దోషులకు శిక్ష విధించింది. ఈ మేరకు ఢిల్లీ సాకేత్ కోర్టు శనివారం శిక్షలు ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు జడ్జి రవీంద్రకుమార్ పాండే తీర్పు వెలువరించారు. 2008లో ఢిల్లీలోని ఓ ప్రైవేట్ టీవీ చానళ్లో పనిచేస్తున్న జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ విధులు ముగించుకుని తెల్లవారు జామున ఇంటికి తిరిగి వెళ్తుండగా నలుగురు నిందితులు కారును అడ్డగించి ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసుపై తాజాగా తీర్పు వెల్లడైంది.