చండిగఢ్ః సామన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కరోనా బారీన పడుతున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని 117 ఎమ్మెల్యేలో 23 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ స్వయంగా వెల్లడించడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. అసెంబ్లీ నిర్వహణ సందర్భంగా ఎమ్మెల్యేందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తెలిసిందన్నారు. ప్రముఖులకే కరోనా కొరల్లో చిక్కుతుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారో లేదో చూడాలి.