సీఎం జగన్‌పై ఏపీ ఎన్నికల సంఘానికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు చేశారు. “ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా నా కుటుంబంపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారు.
విశాఖలో డ్రగ్స్ ఘటనలో సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో మాకు వాటా ఉందని సీఎం జగన్ ఓ సభలో మాట్లాడారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.” అని ఈసీకి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు.