Puri Jagannath : ”లైగర్”, ”డబుల్ ఐస్మార్ట్” వంటి రెండు వరుస డిజాస్టర్ల తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ కు (Puri Jagannath) ఒక భారీ హిట్ అవసరం. ఈ క్రమంలో వరుస డిజాస్టర్ల తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేయడనికి స్టార్ హీరోలు కాదు చిన్న హీరోలు కూడా ముందుకు రావడం లేదు. అయితే ఇలాంటి టైంలో పూరి ఒక తమిళ స్టార్ హీరోతో ప్రయోగం చేయబోతున్నాడు. తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాకి పూరి ”బెగ్గర్”అనే టైటిల్ పెట్టాడు. ఒక కొత్త కథతో పూరి ఈ సినిమాని తీయబోతున్నాడు అని సమాచారం. తన సినిమాలకు కంటే బిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. మరి పూరి జగన్నాధ్ ఈ సినిమాతో రిస్క్ చేసి హిట్టు కొడతాడో లేదో చూడాలి.