Homeహైదరాబాద్latest NewsPuri Jagannath : తెలుగు హీరో నో సిగ్నల్.. తమిళ హీరో గ్రీన్ సిగ్నల్

Puri Jagannath : తెలుగు హీరో నో సిగ్నల్.. తమిళ హీరో గ్రీన్ సిగ్నల్

Puri Jagannath : ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannath) అంటే మాస్ సినిమాలకు మారు పేరు.. కేవలం ఒక సినిమాతోనే హీరోల ఇమేజ్ మార్చగల సత్తా ఉన్న డైరెక్టర్. గతంలో పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు వెయిట్ చేసెవారు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది. ప్రస్తుతం పూరి ఒక్క హిట్టు కోసం చాలా కష్టపడుతున్నాడు. ”లైగర్”, ”డబుల్ ఐస్మార్ట్” వంటి రెండు వరుస డిజాస్టర్ల తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేయడనికి స్టార్ హీరోలు కాదు చిన్న హీరోలు కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ఇటీవలే పూరి తన తదుపరి సినిమాని అక్కినేని నాగార్జున తో తీయాలని ప్లాన్ చేసాడు కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తెలుగు హీరోలు తనతో సినిమా చేయడానికి ముందకు రావడం లేదు అని రూట్ మర్చి తమిళ హీరోల వైపు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాధ్ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు అని సమాచారం. ఆల్రెడీ పూరి ఒక పక్క మాస్ సినిమా కధను విజయ్ కి చెప్పాడని.. విజ్జయి సేతుపతికి కూడా కధ నచ్చి సినిమాకి ఓకే చెప్పాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు.అయితే పూరికి తెలుగు హీరోలు అంత నో చెప్పగా.. కానీ తమిళ హీరో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

Recent

- Advertisment -spot_img