Homeహైదరాబాద్latest Newsగొల్లపల్లిలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం..

గొల్లపల్లిలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమం..

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం కేంద్రంలో స్వచ్ఛదనం-పచ్చదనం అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా, గ్రామ సెక్రెటరీ మధుసూదన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు కూడా పాల్గొని ఊర్లో ర్యాలీ తీసి, వృక్షో రక్షిత రక్షితః అనే నినాదాలు ఇవ్వడం జరిగింది. ఇంటింటా చెట్లు నాటి, చెట్లకు నీరు పోసి, చెట్లను కాపాడి పచ్చదనాన్ని పెంపొందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సాయిబాబా, గ్రామ సెక్రెటరీ మధుసూదన్, ప్రధానోపాధ్యాయులు, ఏఎన్ఎం, అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్స్, వివో ప్రెసిడెంట్సు, కరబార్ శాతాల మహేష్, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img