Homeహైదరాబాద్latest News'పుష్ప-2' జాతర సీక్వెన్స్‌.. మహిళలకు పూనిన అమ్మవారు..!

‘పుష్ప-2’ జాతర సీక్వెన్స్‌.. మహిళలకు పూనిన అమ్మవారు..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాలోని జాతర సీక్వెన్స్‌లో అల్లుఅర్జున్ నట విశ్వరూపం చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అయితే థియేట‌ర్ల‌లో జాతర సీక్వెన్స్‌ వ‌స్తున్న‌ప్పుడు ప‌లువురు మ‌హిళ‌ల‌కు అమ్మ‌వారు పూనింది. ఈ సంఘటన రెండు చోట్ల జరిగింది. దీంతో పక్క సీట్లలో ఉన్న వారు మహిళలను శాంతింపజేశారు. దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img