Homeహైదరాబాద్latest News‘పుష్ప 2’ మూవీ 2 డే కలెక్షన్స్.. అసలు తగ్గేదేలే..!

‘పుష్ప 2’ మూవీ 2 డే కలెక్షన్స్.. అసలు తగ్గేదేలే..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ డే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.294 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు కూడా ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ఈ సినిమా రెండో రోజు 100 కోట్ల నుంచి 105 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉండగా, ఓవర్సీస్ లో 2.5-3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, అయితే వరల్డ్ వైడ్ గా రెండో రోజు 125 కోట్ల నుంచి 130 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా అక్షరాలా 400 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి వరల్డ్ వైడ్ గా 410 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంటుం అని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img