ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈరోజు తెలంగాణలో టికెట్ బుకింగ్ ప్రారంభించింది. ‘పుష్ప 2’ మూవీ బెనిఫిట్ షో ధర 1200 రూపాయలు ఉంది. ఈ షో కోసం అభిమానులు మొదటి రోజు నుంచి భారీగా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.