ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా వైల్డ్‌ఫైర్ ఈవెంట్ చెన్నైలో జరుగుతుంది. తాజాగా ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే రష్మిక, శ్రీలీల, తమిళ్ డైరెక్టర్ నెల్సన్ హాజరుయ్యారు. ఈ సినిమా ఈవెంట్లో యువ కథానాయిక శ్రీలీల నటించిన ‘కిసక్’ అనే మాస్ ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.