ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ‘బాహుబలి 2’ సినిమా రికార్డును బద్దలుకొట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమా చిత్రబృందం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పింది. ‘పుష్ప 2’ సినిమాకి మరో 20 నిమిషాల సీన్లు వేసి జనవరి 11 నుంచి మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ దెబ్బతో మిగిలిన దంగల్ రికార్డులను బద్దలు కొడతామంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.