Homeహైదరాబాద్latest Newsమరో వివాదంలో ‘పుష్ప 2' మూవీ..! టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్

మరో వివాదంలో ‘పుష్ప 2′ మూవీ..! టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‏గా నటించింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు నుంచి వివాదాల్లో నిలుస్తుంది. ‘పుష్ఫ 2’ భారీ బడ్జెట్‌తో రూపొందిందని, పాన్ ఇండియా మూవీ అని చెబుతూ ఈ సినిమా టిక్కెట్ ధరలను పెంచాలని చిత్రబృందం తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా టిక్కెట్ల ధరలను పెంచేందుకు అనుమతించింది.ప్రీమియర్ల టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ల టిక్కెట్ ధరపై రూ.800 వరకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా ఈ సినిమా టికేట్లు ధరలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘పుష్ప 2’ టిక్కెట్ ధరల పెంపుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Recent

- Advertisment -spot_img