ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ వీడియో మేకింగ్ లో సుకుమార్ మేకింగ్ మాములుగా లేదు.. ఈ సినిమా మేకింగ్ ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో సుకు తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం అల్లుఅర్జున్ కూడా చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా మేకింగ్ లోనే ఇంత ఫైర్ ఉంది అంటే.. సినిమాలో ఇంకా వైల్డ్ ఫైర్ అనే తెలుస్తుంది.ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.