సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇంతలో, ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. నెట్‌ఫ్లిక్స్ తో ‘పుష్ప 2’ నిర్మతలు దాదాపు రూ. 250 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది అని సోషల్ మీడియా ద్వారా ఓటిటి సంస్థ ప్రకటించింది.