Homeహైదరాబాద్latest News'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో కేసులో.. ముగ్గురు అరెస్ట్..!

‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో కేసులో.. ముగ్గురు అరెస్ట్..!

‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో చూసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కి వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ తొక్కిసలాట కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. చిక్కడపల్లి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ముగ్గురిని అరెస్టు చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img