ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో చిత్రబృందం ప్రకటించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు జరుగనుంది అని చిత్రబృందం తెలిపారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.