ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయినిగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు భాషల్లో డిసెంబర్ 5న థియేటర్లో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం పలు ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంలో పుష్ప 2ను ఐమాక్స్ టెక్నాలజీలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.