ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం సాయంత్రం అనేక రాష్ట్రాల్లో ప్రీమియర్లు ప్రదర్శించబడ్డాయి. ఈ సినిమాని ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్ ప్రకటించింది. ఇది గురువారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి సంబంధించిన డీల్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ వాటా ఇవ్వాలని నిర్మాతలు ప్రసాద్ ను కోరినట్లు తెలుస్తోంది.