Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీ సక్సెస్ మీట్‌.. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్…!

‘పుష్ప 2’ మూవీ సక్సెస్ మీట్‌.. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్…!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప2’. ఈ సినిమా విడుదలై రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ సినిమా రెండో రోజు 449 కోట్లు వసూళ్లు చేసింది అని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ ని చిత్రబృందం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఈ సినిమాకు టిక్కెట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు, అయితే ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీంతో నీళ్లు తాగడానికి కాస్త సమయం తీసుకున్న తరువాత సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరో అల్లు అర్జున్ సీఎం సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయాడంటూ ట్రెండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img