ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. నేడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ‘పుష్ప 2’ మూవీ టీమ్ కలిసింది. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవిశంకర్, నవీన్ యేర్నేని, సీఈఓ చెర్రీ, దర్శకుడు సుకుమార్ కలిశారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి ‘పుష్ప 2’ మూవీ యూనిట్ బ్లెస్సింగ్స్ తీసుకున్నరు.