Homeహైదరాబాద్latest Newsచెన్నైలో 'పుష్ప 2' వైల్డ్‌ఫైర్ ఈవెంట్..రిలీజ్ కానున్న 'కిస్సిక్' ఐటెం సాంగ్

చెన్నైలో ‘పుష్ప 2’ వైల్డ్‌ఫైర్ ఈవెంట్..రిలీజ్ కానున్న ‘కిస్సిక్’ ఐటెం సాంగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‏గా నటించింది. తాజాగా ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం చెన్నైలో భారీ వైల్డ్‌ఫైర్ ఈవెంట్ ను చిత్రబృందం నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమం కోసం అల్లుఅర్జున్, రష్మిక చెన్నై వెళ్లారు. ఈ వైల్డ్‌ఫైర్ ఈవెంట్లో ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ‘కిసక్’ అనే మాస్ ఐటెం సాంగ్ లో యువ కథానాయిక శ్రీలీల నటించింది. ఈ సాంగ్ ఈవెంట్ చెన్నైలో లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

Recent

- Advertisment -spot_img