Homeహైదరాబాద్latest News'పుష్ప 3' మూవీ కన్ఫర్మ్.. టైటిల్ ఏంటో తెలుసా?

‘పుష్ప 3’ మూవీ కన్ఫర్మ్.. టైటిల్ ఏంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‏గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పుష్ప 3 ఉండబోతుంది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే పార్ట్ 3 కూడా ఉంటుందని ఇప్పటికే సుకుమార్, అల్లు అర్జున్ హింట్ ఇచ్చిన ఇచ్చారు. తాజాగా ఈ వార్తను నిజం చేస్తూ బయటికి వచ్చిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆస్కార్ విన్నర్ రెసూల్ పూకుట్టి పుష్ప 2కి సౌండ్ మిక్సింగ్ చేశారు. ఇటీవల పుష్ప 2 సౌండ్ మిక్సింగ్ పూర్తయింది. ఆ సందర్భంగా తీసిన ఫోటో ఇది. ఇక ఆ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ‘పుష్ప 3 ద ర్యాంపేజ్’ అనే టైటిల్ స్క్రీన్ పై ఉంది. దీనిని బట్టి పుష్ప 2 క్లైమాక్స్ లో ‘పుష్ప 3’ సినిమాకు సంబంధించిన లీడ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.suk 1 ఇదేనిజం 'పుష్ప 3' మూవీ కన్ఫర్మ్.. టైటిల్ ఏంటో తెలుసా?

Recent

- Advertisment -spot_img