Homeసినిమా‘Pushpa’ కేశవ వేధింపులతో జూనియర్​ ఆర్టిస్ట్​ సూసైడ్​

‘Pushpa’ కేశవ వేధింపులతో జూనియర్​ ఆర్టిస్ట్​ సూసైడ్​

– పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: పుష్ప మూవీలో అల్లు అర్జున్​ పక్కన కేశవ అనే పాత్రలో నటించిన జగదీశ్​ పై పంజాగుట్ట పీఎస్​ లో కేసు నమోదైంది. అతడిని పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​ కు తరలించారు. జగదీశ్​ వేధింపులతో ఓ జూనియర్ ఆర్టిస్ట్​ సూసైడ్​ చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. జగదీశ్​ వేధింపులతో ఓ జూనియర్​ ఆర్టిస్ట్​ సూసైడ్​ చేసుకున్నది. దీంతో అతడిపై కేసు నమోదైంది. పంజాగుట్టకు చెందిన ఓ జూనియర్​ ఆర్టిస్ట్​ తో జగదీశ్​ కు కొంతకాలంగా పరిచయం ఉంది. అయితే జగదీశ్​.. సదరు జూనియర్​ ఆర్టిస్ట్​.. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తానని బెదిరించాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేయగా.. జగదీశ్​ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. దీంతో పోలీసులు జగదీశ్​ పై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Recent

- Advertisment -spot_img