HomeసినిమాPushpa Movie Review : పుష్ప రివ్యూ.. కథ, ప్లస్సు.. మైనస్సులు

Pushpa Movie Review : పుష్ప రివ్యూ.. కథ, ప్లస్సు.. మైనస్సులు

Pushpa Movie Review : పుష్ప రివ్యూ.. కథ, ప్లస్సు.. మైనస్సులు

Pushpa Movie Review : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే మళ్లీ ఓ ప్రేమకథతో వస్తారేమో అనుకుంటే ఈసారి పుష్ప అంటూ చాలా పెద్ద కథతోనే వచ్చారు.

ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ :

ఒక అణగారిన కుటుంబానికి చెందిన హీరో పుష్ప రాజ్ (అల్లు అర్జున్) తన ధైర్యంతో తనకు వచ్చిన ప్రతి అడ్డంకులను దాటుకుంటూ వెళ్తాడు.

Read This : దేశంలో వ్యవసాయ కుటుంబాల్లో 90 శాతం చిన్న రైతులే…

సాధారణ కూలీగా శేషాచలం అడవుల్లో పనిచేసే పుష్ప రాజ్ సాండిల్ వుడ్ సిండికేట్ లీడర్ గా ఎలా మారాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

పుష్ప రాజ్ పాత్ర చేసిన అల్లు అర్జున్ కు ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాలి.

స్టార్ హీరోగా ఇప్పటికే ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోశించిన బన్నీ కెరియర్ లో మొదటిసారి చాలా బలమైన పాత్ర చేశాడని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ ఇన్నేళ్ల నట విశ్వరూపం అంతా పుష్ప రాజ్ పాత్రలో చూపించాడు అల్లు అర్జున్.

క్యారక్టర్ చేయడం అంటే ఏదో డైరక్టర్ చెప్పింది చేయడం కాదు.

ఆ పాత్ర పట్ల అంకితభావం.. దర్శకుడి తన మీద పెట్టుకున్న నమ్మకం ఇవన్ని దృష్టిలో పెట్టుకుని బన్నీ ఈ పుష్ప పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Read This : మీ మొబైల్​లో ఈ యాప్స్​ ఉన్నాయా..

ఇక హీరోయిన్ రష్మిక కూడా ఇప్పటి వరకు తన కెరియర్ లో చేయని డీ గ్లామరస్ రోల్ లో నటించి మెప్పించింది.

అల్లు అర్జున్ రష్మిక జోడీ ఆకట్టుకుంది. ఇక కొండా రెడ్డి పాత్రలో అజయ్ ఘోష్ అతని బ్రదర్స్ ఓకే అనిపించారు.

మంగళం శ్రీనుగా సునీల్ ఏమంత పెద్దగా ఆకట్టుకోలేదు. రావి రమేష్ పాత్ర ఈ భాగంలో తక్కువే ఉంది.

ఇక పార్ట్ 1 లో ఎస్పీ భన్వీర్ సింగ్ గా వచ్చి సర్ ప్రైజ్ చేశాడు మళయాళ స్టార్ ఫహద్ ఫాజిల్.

తన పాత్ర అసలు విశ్వరూపం సెకండ్ పార్ట్ లో ఉంటుందని అర్ధమయ్యేలా ఈ పార్ట్ లో శాంపిల్ చూపించారు.

పుష్ప రాజ్ అసిస్టెంట్ గా చేసిన కేశవ పాత్రదారుడి అభినయం మెప్పించింది.

చాలా నేచురల్ గా అతని నటన ఆకట్టుకుంది.

సాంకేతిక విభాగం :

సుకుమార్ చెప్పాలనుకున్న కథను బాగా చెప్పాడు.

సుకుమార్ అనగానే క్లాస్ డైరక్టర్ అన్న టాక్ ఉండేది.

Read This : తినేప్పుడు పచ్చిమిర్చి ఏరేస్తున్నారా..

కాని ఈ సినిమాతో అతను ఊర మాస్ సినిమాలను కూడా తీయగలడు అని ప్రూవ్ చేశాడు.

ఎంచుకున్న కథ.. నడిపించిన కథనం అంతా చాలా క్లారిటీగా తీసుకెళ్లాడు.

ఓ పక్క హీరో పాత్రకి ఇంటి పేరు అంటూ సెంటిమెంట్ ను యాడ్ చేస్తూ మరో పక్క తన ఎటాకింగ్ క్యారక్టరైజేషన్ ను బాగా ఎలివేట్ చేశాడు డైరక్టర్.

అయితే అక్కడక్కడ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.

సినిమా కథ కొద్దిగా కె.జి.ఎఫ్ తరహాలో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా వరకు బాగానే అనిపించినా కొన్ని సీన్స్ మాత్రం పెద్దగా మెప్పించలేదు.

ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దేవి మ్యూజిక్ నిజంగానే అద్భుతం చేసింది. బిజిఎం విషయంలో డబుల్ డోస్ అందించాడు.

Read This : బ్రోకర్​ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్‌ ఎలా..

మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు.

సుకుమార్ రాసుకున్న కథను తెరరూపం దాల్చడంలో నిర్మాతల సపోర్ట్ కనిపిస్తుంది.

పెట్టిన ప్రతి పైసా తెర మీద కనిపించేలా చేశాడు సుకుమార్.

విశ్లేషణ : (Pushpa Movie Review)

అణగారిన కుటుమ్న నేపథ్యం నుడి వచ్చిన ఓ వ్యక్తి కథ పుష్ప.

ఈ సినిమా కథను ఆడియెన్స్ ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు.

మాస్ హీరో ఎలివేషన్, మదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ, కామెడీ సీన్స్, భారీ యాక్షన్స్ సీన్స్ ఇవన్ని పుష్పకి పాజిటివ్ అంశాలని చెప్పొచ్చు.

సాండిల్ వుడ్ సిండికేషన్.. అసలు ఈ స్మగ్లింగ్ ఎక్కడ నుండి ఎక్కడకు జరుగుతుంది అన్న విషయాలని చాలా క్లియర్ గా ప్రస్థావించారు సుకుమార్.

Read This : ఉదయం ఇవి తింటే ఇక ఆరోగ్యం మీ చేతుల్లోనే

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఎంగేజింగ్ గా అనిపించగా సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.

ఇక సెకండ్ పార్ట్ కోసం లీడ్ తీసుకున్న విధానం బాగానే అనిపించినా సినిమా లెంగ్ దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ మీద ఇంకాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది అనిపిస్తుంది.

బాటమ్ లైన్:

అల్లు అర్జున్ కోసం వెళ్ళండి – అల్లు అర్జున్‌ని ఆశించవద్దు.

Recent

- Advertisment -spot_img