Homeహైదరాబాద్latest Newsకలెక్షన్స్ లో 'పుష్ప రాజ్' జోరు..! మొద‌టి రోజు వ‌సూళ్లు ఎంతంటే..?

కలెక్షన్స్ లో ‘పుష్ప రాజ్’ జోరు..! మొద‌టి రోజు వ‌సూళ్లు ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై పాజిటివ్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. బుధవారం రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన పుష్ప-2 ఓవర్సీస్ లోనూ కలెక్షన్ల పరంగా టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమా దాదాపు రూ. 175 కోట్లు వసూలు చేసింది. కాగా, పుష్ప-2 అమెరికాలో తొలి రోజు దాదాపు 4.2 మిలియన్ డాలర్లు (రూ. 35 కోట్లు) వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img