Homeహైదరాబాద్latest Newsబాలీవుడ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న ‘పుష్ప రాజ్’..! 10 రోజుల్లో ఎన్ని కోట్లుంటే..?

బాలీవుడ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న ‘పుష్ప రాజ్’..! 10 రోజుల్లో ఎన్ని కోట్లుంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 05న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటికే పలువురు స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. హిందీలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన షారుఖ్ ‘జవాన్’ సినిమా రికార్డు ని 69 కోట్లను బద్దలు కొట్టింది. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డును నమోదు చేసింది. కేవలం 10 రోజుల్లోనే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img