క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా నిన్న విడుదలై బాక్సాఫీస్ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. హిందీలో పుష్ప మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమా తొలిరోజు షారుఖ్‌ఖాన్ నటించిన ‘జవాన్’ను అధిగమించి రికార్డులు సృష్టించింది. 65 కోట్ల గ్రాస్‌తో గతంలో అత్యధిక రోజు డే 1 హిందీ వసూళ్లు ‘జవాన్’ పేరు మీద ఉంది. అయితే ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ 72 కోట్ల గ్రాస్‌తో బాలీవుడ్‌లో కొత్త ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. హిందీలో డబ్బింగ్ సినిమాకి అత్యధిక ఓపెనింగ్ రోజుగా రికార్డులు నెలకొల్పడం ద్వారా పుష్ప 2 సంచలన ప్రభావం చూపింది.