Homeహైదరాబాద్latest Newsభారీ కలెక్షన్స్ తో.. బాలీవుడ్ ను రూల్ చేస్తున్న 'పుష్ప రాజా'..! మూడు రోజుల్లో ఎంతంటే..?

భారీ కలెక్షన్స్ తో.. బాలీవుడ్ ను రూల్ చేస్తున్న ‘పుష్ప రాజా’..! మూడు రోజుల్లో ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 05న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే 500 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటికే పలువురు స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. హిందీలో తొలిరోజు 72 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు 59 కోట్లు వసూలు చేసింది. హిందీలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన షారుఖ్ ‘జవాన్’ సినిమా రికార్డు ని 69 కోట్లను బద్దలు కొట్టింది. అయితే మూడో రోజు కూడా హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో ‘పుష్ప 2’ సినిమా మూడో రోజునే 74 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. హిందీలో ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా మూడో రోజు ఇన్ని కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది. కేవలం హిందీలోనే మూడు రోజుల్లో 205 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వసూలు చేసి ‘పుష్ప 2’ సరికొత్త రికార్డు సృష్టించింది.

Recent

- Advertisment -spot_img