డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”(Pushpa2TheRule). ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ నుంచి నిన్న సెకండ్ సింగిల్ విడుదలైంది. ఈ చిత్రం నుంచి ‘సూసేకి’ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్ 10 మిలియన్లు, హిందీ 6 మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధిక మంది వీక్షించిన వీడియోగా ఈ పాట అగ్రస్థానంలో నిలిచినట్లు ఓ అభిమాని ట్వీట్ చేశారు.