Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందిస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. మంగళవారం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మస్తాన్ వలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయినేనీ చంద్రకాంత్ రావు, హరినాథ్, లక్ష్మీ నరసయ్య, సత్యనారాయణ, శ్యామ్ రావు, చంద్రమోహన్, దుర్గ, సురేష్,ఎర్ర లక్ష్మయ్య, శివ సాగర్, రాచాల శీను, సోములు, రావు, కేబుల్ రమేష్, పంతులు,భాస్కర్, రాజుమల్లన్న, యాదగిరి, శంకర్ గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img