బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం హోరా హోరీగా సాగుతుంది. తాజాగా ఈ సీజన్ 13వ వారంలోకి అడుగుపెట్టింది.అయితే హౌసులో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. తాజగా బిగ్‌బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో రోహిణి, విష్ణు ప్రియా మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో చివరి మెగా చీఫ్‌గా అవడానికి కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నరు. దీనిలో భాగంగా బిగ్‌బాస్ హౌసులో ఒక ఆటో పెట్టారు. ఆ ఆటోలో మెగా చీఫ్ కంటెస్టెంట్స్ అయినా తేజ, పృథ్వి , రోహిణి, యాష్మి, విష్ణు ప్రియా ఉన్నారు. అయితే ఆటోలో నుండి ముందుగా ఎవరు బయటికి వస్తే వారు మెగా చీఫ్ అవడానికి అనర్హలు అని బిగ్‌బాస్ చెపుతారు. అయితే ముందుగా ఆటో నుండి తేజని మిగతా కంటెస్టెంట్స్ తోసేస్తారు. ఆ తరువాత రోహిణి ని ఆటో నుండి బయటికి పంపాలని విష్ణుప్రియా పృథివీ తో అంటుంది. అలాగే రోహిణి కూడా బయటికి తోసేస్తారు. ఆ తరువాత యాష్మి కూడా గేమ్ నుండి అవుట్ అవుతుంది. అయితే యాష్మి అవుట్ అయ్యాక పృథివీ తో నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని గొడవకు దిగుతుంది. దానికి పృథ్విఇది గేమ్ మాత్రమే పర్సనల్ గా తీసుకోవద్దు అని అంటాడు. నేను మీ ఇద్దరు ఎలా ఆడుతారో చూస్తా అని యష్మి అంటుంది. ఆ తరువాత విష్ణుప్రియా మాట్లాడుతూ… రోహిణి చాలా సేపటినుండి చూస్తున్న నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు.. ని క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని అంటుంది. దానికి రోహిణి క్యారెక్టర్ గురించి మాట్లాడొద్దు అని ఫైర్ అవుతుంది. రోహిణి మాట్లాడుతూ.. విష్ణుప్రియా నువ్వే చెప్పావ్ ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేశాను అవ్వలేదు.. తరువాత పృథ్వికి ట్రై చేశానని.. ఎవరు ప్లాన్ చేసారు.. చెపింది గుర్తు తెచ్చుకో అని రోహిణి అంటుంది. విష్ణుప్రియా నువ్వు నోరు జారుతునవ్ అని రోహిణి అంటుంది. దాంతో ఈ బిగ్‌బాస్ ప్రోమో లో రోహిణి vs విష్ణుప్రియా మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది.