Homeహైదరాబాద్latest Newsఓఆర్ఆర్ - రీజినల్ రింగ్ రోడ్ మధ్య రేడియల్ రోడ్లు.. ఏ ప్రాంతాల మీదుగా అంటే..!

ఓఆర్ఆర్ – రీజినల్ రింగ్ రోడ్ మధ్య రేడియల్ రోడ్లు.. ఏ ప్రాంతాల మీదుగా అంటే..!

ఓఆర్ఆర్ మరియు రీజినల్ రింగు రోడ్డులను కలుపుతూ రేడియల్ రోడ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెుత్తం 11 చోట్ల ఈ రెండు ప్రాజెక్టులను కలుపుతూ.. రహదారులను నిర్మించాలని భావిస్తోంది. ఈ 11 రేడియల్‌ రహదారుల మొత్తం పొడవు 300 కి.మీ.కుపైగానే ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకోసం దాదాపు 1000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నెంబర్ 2, 4, 8, 10, 13, 15 నంబర్లతోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లను నిర్మించాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే కొన్నిచోట్ల భూసేకరణకు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు.

Recent

- Advertisment -spot_img