ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీలో ప్రసంగించారు. కర్మ ఎంత బలమైనదో రఘురామ ఉదాహరణే నిదర్శనం అని పవన్ కళ్యాణ్ అన్నారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దని సవాల్ విసిరిన వారు ఈరోజు మీ ముందు అసెంబ్లీకి రాలేకపోయారు..ఇదే కర్మ సిద్ధాంతంని పవన్ కళ్యాణ్ అన్నారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వారిని రాజకీయాల్లోకి రానివ్వకూడదని. గతంలో రఘురామకృష్ణరాజు ఎలా బాధపటారో చూశాం.తమ పార్టీ తరపున స్వయంగా ఎంపీగా ఎన్నికైన రఘురామను ఇబ్బందిపెట్టారు.ఓటు చీలకూడదన్న నా నిర్ణయం సరైనదేనని అర్థమైంది. ఈరోజు మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్ పదవిలో చూశాక అర్థమైంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.