– మేడ్చల్ సభలో గులాబీ గూటికి
– ఉప్పల్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ
ఇదేనిజం, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. కాంగ్రెస్ నుంచి ఆయన ఉప్పల్ టికెట్ ను ఆశించారు. కాగా ఆ పార్టీ టికెట్ పరమేశ్వర్‌రెడ్డికి దక్కింది. దీంతో రాగిడి పార్టీని వీడనున్నట్టు ప్రకటించారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గంలో జరగనున్న సభలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. ముందుగా ఆయన ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలువనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన చేతులు మీదుగా రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.