HomeతెలంగాణRahul:ఆటో గ్రాఫ్​ ఇస్తావా? చిన్నారిని అడిగిన రాహుల్​

Rahul:ఆటో గ్రాఫ్​ ఇస్తావా? చిన్నారిని అడిగిన రాహుల్​

– సోషల్ మీడియాలో వీడియో వైరల్​

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఓ చిన్నారిని ఆటో గ్రాఫ్​ ఇస్తావా? అంటూ అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇటీవల ఆయన తమిళనాడులో పర్యటించారు. ఊటీలో పూర్తిగా మహిళల చేత నడుపబడుతున్న ఓ చాక్లెట్‌ ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ చాక్లేట్ల తయారీ గురించి తెలుసుకున్నారు. ఈ టైమ్​ లోనే ఓ చిన్నారి రాహుల్‌ దగ్గరకు వచ్చింది. కొద్దిగా ఆటోగ్రాఫ్‌ ఇస్తారా? అంటూ పెన్ను, పేపర్‌ అతని చేతిలో పెట్టింది. ఆ బుక్‌లో తన సంతకం చేసిన తర్వాత.. తనకు ఓ ఫేవర్‌ చేస్తావా అంటూ ఆ చిట్టితల్లిని రాహుల్‌ గాంధీ అడిగారు. ఆమె నవ్వుతూ ఓకే చెప్పింది. అదే నోట్‌బుక్‌ను ఆమెకు ఇచ్చి నీ ఆటోగ్రాఫ్‌ ఇవ్వవా అంటూ అడిగారు. సంతోషం వ్యక్తంచేసిన ఆ చిన్నారి.. చిరునవ్వులు చిందిస్తూ తన పేరు రాసి ఇచ్చింది. ఈ వీడియోను తాజాగా కాంగ్రెస్​ పార్టీ అఫిసియల్​ ట్విట్టర్​ పేజ్​ లో పోస్ట్​ చేయగా వైరల్ అవుతోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img