Homeమరిన్నిPoliticsRahul and Priyanka will go to the state tomorrow రేపు రాష్ట్రానికి Rahul,Priyanka

Rahul and Priyanka will go to the state tomorrow రేపు రాష్ట్రానికి Rahul,Priyanka

– రామప్ప దేవాలయంలో ప్రత్యేకపూజలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంకా గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రచార సన్నాహాల్లో భాగంగా బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. బుధవారం కాంగ్రెస్​ పార్టీ బస్సు యాత్ర ప్రారంభం కానున్నది. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 18న ములుగు, భూపాలపల్లిలో రాహుల్ పర్యటన ఉండనుండగా.. ఆ రోజున ములుగులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 19న కరీంనగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఆ రోజున భూపాలపల్లిలో బహిరంగ సభ ఉండనుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img