Homeఫ్లాష్ ఫ్లాష్rahul gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

rahul gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

  • ‘మోదీ ఇంటిపేరు’ పరువునష్టం కేసులో ఊరట..
  • సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే..
  • గతంలో రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం

rahul gandhi: ఇదేనిజం, హైదరాబాద్: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది. ‘మోడీ ఇంటిపేరు’ కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టులో రాహుల్ కు ఊరట లభించింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. 2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ దోషి అని తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

‘దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోంది’ అంటూ రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు గాంధీని దోషిగా తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది.

Recent

- Advertisment -spot_img